Nitish Kumar Reddy: నితీశ్ కుమార్ ఫిఫ్టీ సెలబ్రేషన్ పై మైత్రీ మూవీ మేకర్స్ స్పందన

Mythri Movie Makers responds on Nitish Kumar Reddy half century celebration

  • ఆసీస్ తో నాలుగో టెస్టులో నితీశ్ కుమార్ సూపర్ బ్యాటింగ్
  • తొలి ఫిఫ్టీనే సెంచరీగా మార్చుకున్న తెలుగుతేజం
  • 'తెలుగుబిడ్డ నుంచి వైల్డ్ ఫైర్ కొట్టుడు' అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్

ఆంధ్రా క్రికెట్ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా టూర్ కోసం టీమిండియాకు ఎంపికైనప్పుడు... చాలామంది సందేహాలు వ్యక్తం చేశారు. అయితే, ఈ టెస్టు సిరీస్ లో నితీశ్ స్కోర్లు చూస్తే ఆ సందేహాలు అన్నీ పటాపంచలు అయిపోతాయి. 41, 38 (నాటౌట్), 42, 42, 16, 105 (బ్యాటింగ్).... ఇవీ మనవాడి బ్యాటింగ్ గణాంకాలు. బౌలింగ్ లోనూ తన వంతుగా 3 వికెట్లు తీశాడు. 

ఇవాళ తన ఆటతీరును మరోస్థాయికి తీసుకెళ్లిన ఈ తెలుగుతేజం తొలి ఫిఫ్టీనే సెంచరీగా మలుచుకుని చిరస్మరణీయం చేసుకున్నాడు. కాగా, ఫిఫ్టీ సాధించిన అనంతరం నితీశ్ కుమార్ రెడ్డి పుష్ప స్టయిల్లో 'తగ్గేదే లే' అని బ్యాట్ తో సెలబ్రేట్ చేసుకోవడం అందరినీ అలరించింది. కామెంటేటర్లు కూడా "పుష్పా" అంటూ వ్యాఖ్యానించారు. 

ఇక, నితీశ్ కుమార్ రెడ్డి అర్ధసెంచరీ సెలబ్రేషన్ పై పుష్ప, పుష్ప-2 చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందించింది. 'తెలుగు బిడ్డ నుంచి వైల్డ్ ఫైర్ కొట్టుడు' అంటూ ట్వీట్ చేసింది. నితీశ్ 'తగ్గేదే లే' సెలబ్రేషన్ తాలూకు వీడియోను కూడా పంచుకుంది.

  • Loading...

More Telugu News