TTD: శ్రీవారి దర్శనం... తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై టీటీడీ కీలక నిర్ణయం!
- తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని నిర్ణయం
- వారానికి రెండుసార్లు సిఫార్సు లేఖలను అనుమతించాలని నిర్ణయం
- తెలంగాణ నుంచి వచ్చే సిఫార్సు లేఖలను అనుమతించాలన్న మెజార్టీ సభ్యులు
తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. వారానికి రెండుసార్లు వారి సిఫార్సు లేఖలను అనుమతించాలని నిర్ణయించింది.
శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించకపోవడంపై ఇటీవల చర్చ సాగుతోంది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించకపోవడాన్ని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఖండించారు. తిరుమల శ్రీవారి దర్శనంలో తెలంగాణ వారికి అన్యాయం జరుగుతోందని ఈరోజు మంత్రి కొండా సురేఖ కూడా వాపోయారు.
ఈ క్రమంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల అంశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పునఃపరిశీలించింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని టీటీడీ బోర్డులోని మెజార్టీ సభ్యులు కోరారు. దీంతో వారానికి రెండుసార్లు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది.
అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.