Hyderabad: హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టెక్కీల మృతి

Two techies died in Hyderabad

  • బోరబండకు చెందిన ఆకాంక్ష్, రఘుబాబు మృతి
  • మాదాపూర్‌లోని పర్వత్ నగర్ చౌరస్తా సమీపంలో డివైడర్‌ను ఢీకొన్న బైక్
  • అతివేగమే కారణమని అనుమానిస్తున్న పోలీసులు

హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు మృత్యువాత పడ్డారు. బైక్ అతివేగంగా నడపడమే ఈ ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బోరబండకు చెందిన ఆకాంక్ష్, రఘుబాబు నిన్న అర్ధరాత్రి సమయంలో బోరబండ నుంచి మాదాపూర్ వెళుతున్నారు.

పర్వత్ నగర్ చౌరస్తా సమీపంలో వీరి బుల్లెట్ బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బైక్ నడిపిన యువకుడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

Hyderabad
Road Accident
Bike
Tech-News
Crime News
  • Loading...

More Telugu News