Seethakka: కవిత పాల్గొన్న కార్యక్రమంలో 'సీతక్క' అంటూ ప్రసంగం ప్రారంభించిన సిక్కు నేత... వీడియో ఇదిగో

Sikh leader pronounce Seethakka name in Kavitha meeting

  • కవిత నివాసంలో 40 బీసీ సంఘాలతో సమావేశం
  • సభను ఏర్పాటు చేసిన సీతక్కకు నమస్కారం అన్న సిక్కు నేత
  • పొరపాటును సరిదిద్దుకున్న సిక్కు నేత
  • 'సీతక్క' అనడంతో నవ్విన కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్న ఓ కార్యక్రమంలో 'సీతక్క' పేరు వినిపించింది. ఓ బీసీ సంఘం నేత 'సీతక్క' పేరు పలకడంతో కవిత నవ్వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఎమ్మెల్సీ కవిత బంజారాహిల్స్‌లోని తన నివాసంలో నేడు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 40 బీసీ సంఘాలతో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో ఒక్కో నేత మాట్లాడుతున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఓ సిక్కు సంఘం నేత కూడా మాట్లాడారు. "సభ ఏర్పాటు చేసిన మా సీతక్కకు నమస్కారం" అంటూ ఆ సిక్కు సంఘం నేత ఒకింత తడబాటుకు గురయ్యారు. దీంతో కవిత సహా కార్యక్రమంలోని వారంతా నవ్వేశారు. ఆ వెంటనే పొరపాటును సరిదిద్దుకున్నారు. "సారీ కవితక్క" అంటూ తిరిగి ప్రసంగం కొనసాగించారు. 

  • Loading...

More Telugu News