Vidaa Muyarchi: 'సవదీకా'... అజిత్ 'విడాముయర్చి' చిత్రం నుంచి లిరికల్ సాంగ్ వీడియో విడుదల

Sawadeeka song out now from Ajith starring Vidaa Muyarchi

  • అజిత్, త్రిష జంటగా విడా ముయర్చి చిత్రం
  • మగిళ్ తిరుమేని దర్శకత్వంలో చిత్రం
  • అనిరుధ్ రవిచందర్ సంగీతం

హిట్ పెయిర్ అజిత్, త్రిష జంటగా మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'విడా ముయర్చి'. తాజాగా ఈ చిత్రం నుంచి 'సవదీకా' అనే హుషారైన గీతాన్ని చిత్రబృందం విడుదల చేసింది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ బాణీలకు లిరిక్ రైటర్ అరివు సాహిత్యం అందించారు. ఆంథోనీ దాసన్, అనిరుధ్ రవిచందర్ ఆలపించారు. ఈ లిరికల్ వీడియోకు యూట్యూబ్ లో విశేష స్పందన వస్తోంది. 

'విడా ముయర్చి' చిత్రంలో సీనియర్ నటుడు అర్జున్, రెజీనా, ఆరవ్, నిఖిల్ నాయర్, దాశరథి, గణేశ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం 2025 జనవరి 10న పొంగల్ (సంక్రాంతి) సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Loading...

More Telugu News