Konda Surekha: తిరుమలలో తెలంగాణ భక్తులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు: కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

Konda Surekha hot comments on TTD

  • తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖలను టీటీడీ స్వీకరించడం లేదన్న మంత్రి
  • చంద్రబాబుతో మాట్లాడగా సానుకూలంగా స్పందించారని వెల్లడి
  • తెలంగాణ నుంచి టీటీడీకి అధిక ఆదాయం వస్తోందన్న తెలంగాణ మంత్రి

గత వైసీపీ ప్రభుత్వం మొదలు నేటి వరకు తిరుమలలో తెలంగాణ భక్తులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె నేడు శ్రీశైలం భ్రమరాంబసహిత మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... తిరుమలలో తెలంగాణ భక్తుల పట్ల నిర్లక్ష్యం చూపుతున్నారన్నారు.

తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చే సిఫార్సు లేఖలను టీటీడీ స్వీకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భక్తుల గురించి ఏపీ ప్రభుత్వంతో మంతనాలు జరుపుతున్నట్లు చెప్పారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడగా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. తెలంగాణ భక్తులకు టీటీడీ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

అప్పుడు దురదృష్టం వల్ల తెలంగాణ శ్రీశైలాన్ని కోల్పోయిందన్నారు. తెలంగాణ నుంచి టీటీడీకి అధిక రాబడి వస్తున్నట్లు చెప్పారు. టీటీడీ తెలంగాణలో ధర్మప్రచారానికి నిధులు కేటాయించాలని కోరారు. తెలంగాణలో దేవాలయాలు, కల్యాణ మండపాల నిర్మాణానికి టీటీడీ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News