Manmohan Singh: మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి నివాళులర్పించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

TG CM Revanth Reddy pay tributes to Manmohan Singh

  • నేడు ఢిల్లీకి చేరుకొని నేరుగా మన్మోహన్ సింగ్ నివాసానికి సీఎం
  • మన్మోహన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన తెలంగాణ సీఎం
  • మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి నివాళులర్పించిన ఢిల్లీ సీఎం అతిశీ, కేజ్రీవాల్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈరోజు ఢిల్లీకి చేరుకున్న ఆయన నేరుగా మన్మోహన్ నివాసానికి చేరుకున్నారు. మన్మోహన్ పార్థివదేహం వద్ద అంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రేవంత్ రెడ్డి ఈరోజే హైదరాబాద్ తిరుగు ప్రయాణం కానున్నారు.

మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహానికి రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఢిల్లీ సీఎం అతిశీ, మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నివాళులు అర్పించి, వారి కుటుంబాన్ని పరామర్శించారు.

Manmohan Singh
Revanth Reddy
Telangana
Congress
  • Loading...

More Telugu News