Allu Arjun: కాసేపట్లో నాంపల్లి కోర్టుకు హాజరుకానున్న అల్లు అర్జున్
- సంధ్య థియేటర్ ఘటనలో బన్నీకి రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
- నేటితో ముగుస్తున్న రిమాండ్ గడువు
- ప్రాసెస్ లో భాగంగా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకానున్న అల్లు అర్జున్
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టుకు సినీ హీరో అల్లు అర్జున్ కాసేపట్లో హాజరుకానున్నారు. ఈ కేసులో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు ఈ నెల 13న 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే, తెలంగాణ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నేటితో రిమాండ్ ముగియడంతో... ప్రాసెస్ లో భాగంగా నాంపల్లి కోర్టుకు ఆయన వ్యక్తిగతంగా హాజరుకానున్నారు. కోర్టులో ప్రొసీడింగ్స్ ఒక గంట సేపు కొనసాగే అవకాశం ఉంది.