konstas: కోహ్లీతో వాగ్వాదంపై ఆసీస్ కొత్త ఓపెనర్ సామ్ కాన్ స్టాస్ స్పందన

konstas breaks silence on clash with virat kohli on the field

  • ఇద్దరం కాస్త భావోద్వేగానికి గురయ్యామన్న సామ్ కాన్‌స్టాస్
  • తాను గ్లవ్స్‌ను సరిచేసుకుంటూ విరాట్ వస్తున్న విషయాన్ని గమనించలేదన్న కాన్‌స్టాస్
  • ఇదేమీ పెద్ద సమస్య కాదని కాన్‌స్టాస్ వెల్లడి

ఆసీస్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి రోజు ఆట సందర్భంగా ఆస్ట్రేలియా ఓపెనర్ సామ్ కాన్‌స్టాస్, విరాట్ కోహ్లీ మధ్య వాగ్వివాదం చోటుచేసుకోవడం, దానికి ఐసీసీ విరాట్ కోహ్లీపై చర్యలు తీసుకోవడం తెలిసిందే. మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానాగా విధించిన ఐసీసీ..అతడి ఖాతాలో ఒక డీ మెరిట్ పాయింట్‌ను జోడించింది.

మరో పక్క వీరి మధ్య వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనపై సామ్ కాన్‌స్టాస్ స్పందిస్తూ..తాము ఇద్దరం కాస్త భావోద్వేగానికి గురయ్యామని అనిపిస్తోందన్నాడు. విరాట్ వస్తున్నట్లు తాను గమనించలేదని, గ్లవ్స్‌ను సరిచేసుకునే పనిలో ఉండగా ఇది జరిగిందన్నారు. అయితే, క్రికెట్‌లో ఇలా జరుగుతూ ఉంటుందని, ఇదేమీ పెద్ద సమస్య కాదని కాన్‌స్టాస్ పేర్కొన్నాడు.  

More Telugu News