Manmohan Singh: మన్మోహన్ సింగ్ కు అస్వస్థత... ఢిల్లీ ఎయిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స
- అస్వస్థతకు గురవడంతో ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధాని
- 2004-2014 మధ్య ప్రధానిగా పని చేసిన మన్మోహన్ సింగ్
- పీవీ హయాంలో ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా ఘనత
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆసుపత్రిలో చేరారు. 92 ఏళ్ల కాంగ్రెస్ సీనియర్ నేత అస్వస్థతకు గురవడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు. ఎమర్జెన్సీ విభాగంలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడించాయని పీటీఐ తెలిపింది.
2004-2014 మధ్య కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సమయంలో పదేళ్ల పాటు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నారు. 1991-92 మధ్య పీవీ నర్సింహారావు హయంలో ఆర్థికమంత్రిగా పని చేశారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు అప్పుడే వచ్చాయి.
మన్మోహన్ సింగ్ 1932లో పాకిస్థాన్ (దేశ విభజనకు ముందు)లోని గహ్ ప్రాంతంలో జన్మించారు. పీవీ నర్సింహారావు హయాంలోని ఎల్‌పీజీ (లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్) సంస్కరణల రూపశిల్పిగా ఘనత సాధించారు.