Hyderabad: హైదరాబాద్‌లో మోస్తరు వర్షం... అధిక చలి కారణంగా బయటకు రాలేకపోతున్న జనం!

Heavy Winter Rains Hit Hyderabad

  • వర్షంతో మరింత చల్లగా మారిన హైదరాబాద్ వాతావరణం
  • సికింద్రాబాద్, బంజారాహిల్స్, కోఠి తదితర ప్రాంతాల్లో వర్షం
  • తెలంగాణలోని పలు జిల్లాల్లోను వర్షం, పెరిగిన చలి

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం నాడు మోస్తరు వర్షం కురిసింది. హఠాత్తుగా కురిసిన వర్షంతో హైదరాబాద్‌లో వాతావరణం మరింత చల్లగా మారిపోయింది. పని మీద బయటకు వచ్చినవారు, ఇంటికి వెళుతున్న వారు వర్షం కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

సికింద్రాబాద్, తిరుమలగిరి, బంజారాహిల్స్, జుబ్లీహిల్స్, బోరబండ, కూకట్‌పల్లి, కోఠి, హబ్సిగూడ, తార్నాక, నాంపల్లి, హిమాయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షానికి తోడు చలి తీవ్రత పెరగడంతో చాలామంది ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ఇబ్బందిపడుతున్నారు.

ఆకాశం మేఘావృతమవుతుందని, పొగమంచు, తేలికపాటి వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ ముందుగానే అంచనా వెలువరించింది. ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల నుంచి 25 డిగ్రీల మధ్య ఉండవచ్చని తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 

Hyderabad
Rains
Telangana
  • Loading...

More Telugu News