Revanth Reddy: ఎవరో పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా?... దీన్ని టాలీవుడ్ ఖండించాలి: అల్లు అర్జున్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి
- అల్లు అర్జున్ పేరు మర్చిపోయినందునే రేవంత్ రెడ్డి కక్ష కట్టారన్న బీఆర్ఎస్ నేతలు
- అసత్య ప్రచారం నమ్మవద్దని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య
- సినిమా పరిశ్రమ బాగుండాలని కోరుకునే వ్యక్తిని అన్న సీఎం
పుష్ప-2 విజయోత్సవ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును మరిచిపోయినందుకే అల్లు అర్జున్‌పై సీఎం కక్ష కట్టారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి స్పందించారు. ఎవరో నా పేరును మరిచిపోతే నేను ఫీల్ అవుతానా? నా స్థాయి అది కాదు... అలాంటి అసత్య వార్తలు ఎవరూ నమ్మవద్దని సీఎం అన్నారు. ఇలాంటి ప్రచారాన్ని ఖండించాల్సిన బాధ్యత టాలీవుడ్‌పై ఉందన్నారు.
ఇక, సినిమా వాళ్లు సామాజిక అంశాలపై ప్రచార చిత్రాలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. 'మా' అసోసియేషన్‌కు కావాలంటే స్థలాలు ఇస్తామని, సినీ పరిశ్రమ ప్రభుత్వంతో కలిసి పని చేయాలన్నారు. తాను సినిమా పరిశ్రమ బాగుండాలని కోరుకునే వ్యక్తిని అన్నారు.
ఈరోజు సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన విషయం తెలిసిందే.