Stock Market: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
- లాభాలతో ప్రారంభమై చివరకు ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు
- 0.39 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 22 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల నేపథ్యంలో ఈ ఉదయం మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. అయితే ప్రధాన షేర్లలో అమ్మకాలకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. చివరకు ఫ్లాట్ గా ముగిశాయి.
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 0.39 పాయింట్లు నష్టపోయి 78,472 వద్ద ముగిసింది. నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో 23,750 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అదానీ పోర్ట్స్ (5.19%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.57%), మారుతి (1.49%), సన్ ఫార్మా (1.31%), భారతి ఎయిర్ టెల్ (0.97%).
టాప్ లూజర్స్:
టైటాన్ (-1.05%), ఏషియన్ పెయింట్స్ (-1.00%), నెస్లే ఇండియా (-0.75%), రిలయన్స్ (-0.56%), జొమాటో (-0.56%)