Sonia Gandhi: అస్వస్థతకు గురైన సోనియా గాంధీ

Sonia Gandh suffers illness

  • అస్వస్థతకు గురైన కాంగ్రెస్ మాజీ అధినేత్రి
  • కర్ణాటకలోని బెళగావిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు
  • తల్లి వెంటే ఉన్న ప్రియాంక గాంధీ

కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థత కారణంగా ఆమె కర్ణాటకలోని బెళగావిలో జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలకు దూరమయ్యారు. 

'నవ సత్యాగ్రహ బైఠక్' పేరిట నిర్వహిస్తున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలకు సీడబ్ల్యూసీ సభ్యులతో పాటు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, మాజీ సీఎంలు, పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్లు... ఇలా దాదాపు 200 మంది కాంగ్రెస్ నేతలు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. 

అయితే, సోనియా అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న నేపథ్యంలో,  ప్రియాంక గాంధీ తల్లి వెంటే ఉన్నారు. సోనియా కోలుకుంటే ప్రియాంక కూడా ఈ సమావేశాలకు హాజరవుతారని తెలుస్తోంది. కాగా, రాహుల్ గాంధీ ఈ సమావేశాలకు హాజరయ్యారు.

Sonia Gandhi
Illness
Congress
Belagavi
Karnataka
  • Loading...

More Telugu News