Charmme Kaur: తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు: ఛార్మీ

Charmme Kaur thanked Telangana govt

  • టాలీవుడ్ పెద్దలతో తెలంగాణ సీఎం రేవంత్ భేటీ
  • తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతో పనిచేస్తోందన్న ఛార్మీ
  • వారి విజనరీ నాయకత్వం అభినందనీయం అంటూ ట్వీట్ 
  • కలసికట్టుగా చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేద్దామంటూ పిలుపు

టాలీవుడ్ సినీ ప్రముఖులతో తెలంగాణ ప్రభుత్వ పెద్దలు సమావేశం కావడం పట్ల ప్రముఖ నటి, నిర్మాత ఛార్మీ కౌర్ స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ట్వీట్ చేశారు. వారి విజనరీ నాయకత్వం, చిత్ర పరిశ్రమ పట్ల వారి స్థిరమైన నిబద్ధత అభినందనీయమని పేర్కొన్నారు. 

"ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సినీ పరిశ్రమకు, సమాజానికి లబ్ధి చేకూర్చే సంక్షేమ కార్యక్రమాల పట్ల చైతన్యం కలిగించేందుకు మనస్ఫూర్తిగా తోడ్పాటు అందిస్తాను. కీలకమైన సామాజిక సమస్యలపై అవగాహన కలిగించేందుకు కట్టుబడి ఉంటాను. చిత్ర పరిశ్రమ ఉజ్వల భవిష్యత్తుకు కలసికట్టుగా కృషి చేద్దాం" అని ఛార్మీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News