Tollywood: అల్లు అర్జున్ వివాదంపై రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడలేదు: మురళీ మోహన్

Murali Mohan on Allu Arjun issue

  • రేవంత్ రెడ్డి జనరల్‌గా మాట్లాడారన్న మురళీ మోహన్
  • ఇది సినీ పరిశ్రమకు సంబంధించిన సమావేశం అని వ్యాఖ్య
  • త్వరలో అవార్డులను ఇస్తామని చెప్పారన్న మురళీ మోహన్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు భేటీలో అల్లు అర్జున్ వివాదంపై ప్రత్యేకంగా ప్రస్తావించలేదని, కానీ జనరలైజ్ చేసి మాట్లాడారని సినీ నటుడు మురళీ మోహన్ అన్నారు. ఇది సినీ పరిశ్రమకు సంబంధించిన సమావేశం మాత్రమే అన్నారు. ఈరోజు సినీ ప్రముఖుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం మురళీమోహన్ మాట్లాడుతూ... చిన్న చిన్న సమస్యలు, విభేదాలు ఉంటే సరిచేసుకుంటూ.. సమన్వయంతో ముందుకెళదామని సీఎం చెప్పారన్నారు.

సినిమా పరిశ్రమకు ఏం కావాలో అది చేస్తామని, కానీ పరిశ్రమ నుంచి కూడా తమకు సహకారం ఉండాలని సీఎం కోరినట్లు చెప్పారు. బెనిఫిట్ షోలు, టిక్కెట్ రేట్ల పెంపుపై పునరాలోచన చేయనున్నట్లు చెప్పారని, త్వరలో అవార్డుల ప్రదానోత్సవం చేయనున్నట్లు తెలిపారని మురళీమోహన్  వెల్లడించారు.

పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన తమను ఎంతో బాధించిందని మురళీమోహన్ అన్నారు. సినిమాల్లోనూ కాంపిటీషన్ ఏర్పడిందని, దీంతో ప్రమోషన్ చాలా కీలకంగా మారిందన్నారు. ఎలక్షన్ రిజల్ట్స్ లాగే సినిమా విడుదల మొదటి రోజు ఉంటుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల ఉండటంతో విస్తృత ప్రమోషన్ చేయాల్సి వస్తోందన్నారు.

Tollywood
Revanth Reddy
Murali Mohan
Telangana
  • Loading...

More Telugu News