Dil Raju: బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు అనేవి చిన్న విషయాలు: దిల్ రాజు

Dil Raju talks to media after meeting with CM Revanth Reddy

  • తెలంగాణ సీఎంతో సినీ ప్రముఖుల కీలక సమావేశం
  • సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన దిల్ రాజు
  • సినీ పరిశ్రమ అభివృద్ధి మాత్రమే తమ లక్ష్యం అని వెల్లడి


తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినీ ప్రముఖుల భేటీ అనంతరం ప్రముఖ నిర్మాత, ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. తమ లక్ష్యం సినీ పరిశ్రమ అభివృద్ధి మాత్రమే అని... బెనిఫిట్ షోలు, టికెట్ ధరలు అనేవి చిన్న విషయాలని స్పష్టం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతోందనేది ఒక అపోహ మాత్రమేనని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు అన్ని వర్గాల గౌరవం అందుతోందని తెలిపారు. 

హైదరాబాదులో అన్ని భాషల చిత్రాల షూటింగులు జరగాలని, హాలీవుడ్ సినిమా షూటింగుల స్థాయిలో నగరంలో వసతులు ఉండాలని సీఎం కోరుతున్నారని దిల్ రాజు వెల్లడించారు. సినీ పరిశ్రమకు హైదరాబాదు నగరం హబ్ గా తయారు కావాలన్నారని వివరించారు. సినీ పరిశ్రమ పాజిటివ్ దృక్పథంతో పనిచేయాలని సూచించారని తెలిపారు. 

డ్రగ్స్ కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి టాలీవుడ్ నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని దిల్ రాజు పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమకు అందించాల్సిన భద్రతపై ముఖ్యమంత్రి రాష్ట్ర డీజీపీతో చర్చించారని వెల్లడించారు. ముఖ్యమంత్రితో మరోసారి సమావేశం అవుతామని తెలిపారు.

  • Loading...

More Telugu News