Melbourne Test: మెల్‌బోర్న్ టెస్ట్.. ముగిసిన తొలి రోజు ఆట.. ఆస్ట్రేలియాదే పైచేయి!

Day 1 of Australia vs India conculeded Aussies score is 6 Wickets for 311 Runs

  • ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 311/6
  • రాణించిన ఆసీస్ టాపార్డర్ బ్యాటర్లు
  • భారత బౌలర్లలో అత్యధికంగా 3 వికెట్లు తీసిన జస్ప్రీత్ బుమ్రా

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్‌బోర్న్‌లోని ప్రతిష్ఠాత్మక ఎంసీజీ (మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్) వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు ఆట పూర్తయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఆతిథ్య జట్టు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 311 పరుగులు నమోదు చేసింది. టాపార్డర్ బ్యాటర్లు రాణించడంతో ఈ భారీ స్కోర్ సాధ్యమైంది. రోజు మొత్తం మీద 86 ఓవర్లు పడగా 3.62 రన్ రేట్‌తో ఆసీస్ బ్యాటర్లు పరుగులు సాధించారు.

ఓపెనర్లు సామ్ కొంస్టాస్ 60, ఉస్మాన్ ఖవాజా 57, ఆ తర్వాత వచ్చిన మార్నస్ లబుషేన్ 72, స్టీవెన్ స్మిత్ 68 (నాటౌట్), ట్రావిస్ హెడ్ 0, మిచెల్ మార్ష్ 4, అలెక్స్ కేరీ 31, కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 8 (నాటౌట్) పరుగులు సాధించారు. భారత బౌలర్లలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అత్యధికంగా 3 వికెట్లు వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు.

రెండవ రోజు ఆటలో హైలెట్స్ విషయానికి వస్తే... ఆస్ట్రేలియా అరంగేట్ర ఆటగాడు సామ్ కొంస్టాస్ ఆకట్టుకున్నాడు. దూకుడుగా ఆడి 60 పరుగులు సాధించాడు. బుమ్రా బౌలింగ్‌లో అతడు రెండు సిక్సర్లు బాదడం అబ్బురపరిచింది. ఇక పిచ్‌పై నడిచి వెళుతున్న కొంస్టాస్‌ను విరాట్ కోహ్లీ భుజంతో బలంగా ఢీకొట్టాడు. ఈ చర్య వివాదంగా మారింది. విరాట్‌పై ఐసీసీ చర్యలు తీసుకోవాలంటూ ఆసీస్ మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా ఈ వ్యవహారంపై చర్చ నడుస్తోంది.

  • Loading...

More Telugu News