Pushpa 2: మూడో వారంలోనూ అదే జోరు.. 'పుష్ప‌-2' కలెక్ష‌న్ల‌కు నో బ్రేక్‌!

Allu Arjuns Film Pushpa 2 Is On A Roll In Week 3

  • బుధ‌వారం నాడు మూడోవారంలోకి అడుగు పెట్టిన పుష్ప-2 
  • నిన్న‌ దేశవ్యాప్తంగా రూ.19.75 కోట్లు వసూలు చేసిన మూవీ 
  • రూ.1109.85 కోట్లకు చేరిన దేశీయ కలెక్షన్లు
  • ఒక్క హిందీ వెర్ష‌న్ నుంచే ఏకంగా రూ. 716.65 కోట్ల వ‌సూళ్లు

గ్లోబ‌ల్ స్టార్‌ అల్లు అర్జున్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప-2: ది రూల్' వ‌సూళ్ల సునామీ కొనసాగుతోంది. బుధ‌వారం నాడు మూడోవారంలోకి అడుగు పెట్టిన ఈ మూవీ క‌లెక్ష‌న్లు ఇంకా స్ట‌డీగానే కొన‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ సినిమా వ‌సూళ్ల ప‌రంగా దుమ్ముదులుపుతోంది. దీంతో ప‌లు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. 

ఇక క్రిస్మస్ నుంచి న్యూఇయర్ వరకు పండ‌గ‌ సీజన్ కావడంతో ఈ సినిమా కలెక్షన్లు ఇదే విధంగా కొనసాగవచ్చని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. త్వ‌ర‌లోనే హిందీ వెర్షన్ రూ. 800 కోట్ల మార్క్‌ను దాటుతుంద‌ని ఆయ‌న అంచ‌నా వేశారు. ఈ మేర‌కు త‌ర‌ణ్ ఆద‌ర్శ్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా 'పుష్ప‌-2' మూడో వారం క‌లెక్ష‌న్ల వివ‌రాల‌ను కూడా పంచుకున్నారు.

బుధ‌వారం (డిసెంబర్ 24) నాటికి ఈ సినిమా విడుదలై 21రోజులు పూర్తయ్యాయి. 21వ రోజైన బుధ‌వారం ఈ సినిమా రూ.19.75 కోట్లు వసూలు చేసిందని ‘శాక్‌నిల్క్’ పేర్కొంది. దీంతో బుధ‌వారం నాటికి దేశవ్యాప్తంగా పుష్ప-2 కలెక్షన్లు రూ.1109.85 కోట్లకు చేరాయి. ఇందులో హిందీ వెర్ష‌న్ నుంచే ఏకంగా రూ. 716.65 కోట్లు రావ‌డం విశేషం. కాగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా 'పుష్ప-2' వ‌సూళ్లు రూ.1600 కోట్లు దాటేసిన విషయం తెలిసిందే.

View this post on Instagram

A post shared by Taran Adarsh (@taranadarsh)

  • Loading...

More Telugu News