Errolla Srinivas: పోలీసుల అదుపులోకి బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్

BRS Leader Errolla Srinivas Taken Into Custody by Police
  • ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్న మాస‌బ్‌ట్యాంక్ పోలీసులు
  • గ‌తంలో ఆయ‌న‌పై పోలీసుల విధుల అడ్డ‌గింత‌పై బంజారా హిల్స్ లో కేసు
  • ఈ కేసు విచార‌ణ నిమిత్తం నోటీసులు ఇచ్చేందుకు మారేడ్‌ప‌ల్లిలోని ఆయ‌న ఇంటికి వెళ్లిన పోలీసులు
  • ఇంటి త‌లుపులు తెర‌వ‌ని ఎర్రోళ్ల శ్రీనివాస్‌
  • ఆయ‌న ఇంటికి భారీగా బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు.. పోలీసుల‌తో వాగ్వాదం
బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను మాస‌బ్‌ట్యాంక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ‌తంలో ఆయ‌న‌పై పోలీసుల విధుల అడ్డ‌గింత‌పై బంజారా ‌హిల్స్ లో కేసు న‌మోదైంది. ఈ కేసు విచార‌ణ‌కు రావాల‌ని నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వేస్ట్ మారేడ్‌ప‌ల్లిలోని శ్రీనివాస్ నివాసానికి వెళ్లారు. కానీ, ఆయ‌న త‌లుపులు తెర‌వ‌లేదు. శ్రీనివాస్ ఇంటికి పోలీసులు వ‌చ్చార‌నే విష‌యం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు భారీగా ఆయ‌న ఇంటికి చేరుకున్నారు. 

అనంత‌రం వారు పోలీసుల‌తో వాగ్వాదానికి దిగారు. దాంతో శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, పోలీసుల విధుల అడ్డ‌గింత‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో పాటు మ‌రికొంత మందిపై గ‌తంలో కేసు న‌మోదైంది. ఈ కేసును మాస‌బ్‌ట్యాంక్ ఇన్‌స్పెక్ట‌ర్ ద‌ర్యాప్తు చేస్తున్నారు. 
Errolla Srinivas
BRS
Hyderabad Police
Telangana

More Telugu News