Mallu Bhatti Vikramarka: 20 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి లక్ష్యంతో ముందుకెళ్తున్నాం: భట్టివిక్రమార్క

Bhattivikramarka on renewable energy

  • కొత్త క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ విధానాన్ని ప్రతిపాదించినట్లు వెల్లడి
  • అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని వెల్లడి
  • తెలంగాణలో విద్యుత్ డిమాండ్ క్రమంగా పెరుగుతుందన్న భట్టివిక్రమార్క

2030 నాటికి స్వచ్ఛమైన, స్థిరమైన 20 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, జాతీయస్థాయిలో పెట్టుకున్న లక్ష్యాన్ని అందుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ విధానాన్ని ప్రతిపాదించిందన్నారు.

దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ విద్యుత్ డిమాండ్ క్రమంగా పెరుగుతోందన్నారు. 2023-24లో 15,623 మెగావాట్లుగా ఉన్న విద్యుత్ డిమాండ్ 2027-28 నాటికి 20,968, 2034-35లో 31,809 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.

Mallu Bhatti Vikramarka
Congress
Telangana
  • Loading...

More Telugu News