Venu Swamy: మార్చి 29 వరకు అల్లు అర్జున్ జాతకం ఇలాగే ఉంటుంది: వేణు స్వామి

Venu Swamy comments on Allu Arjun

  • కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ ను పరామర్శించిన వేణు స్వామి
  • శ్రీతేజ్ తండ్రికి రూ. 2 లక్షల చెక్కును అందించిన వైనం
  • అల్లు అర్జున్ జాతకంలో శని ఉందని వ్యాఖ్య

సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను జ్యోతిష్యుడు వేణు స్వామి పరామర్శించారు. అనంతరం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అతని తండ్రి భాస్కర్ ను అడిగి తెలుసుకున్నారు. భాస్కర్ కు రూ. 2 లక్షల చెక్కును అందించారు.

ఈ సందర్భంగా వేణు స్వామి మాట్లాడుతూ... శ్రీతేజ్ ఆరోగ్యం కోసం వారం రోజుల్లో మృత్యుంజయ హోమాన్ని తన సొంత ఖర్చులతో నిర్వహిస్తానని చెప్పారు. ప్రస్తుతం హీరో అల్లు అర్జున్ జాతకంలో శని ఉందని... అందుకే ఈ సంఘటన చోటుచేసుకుందని అన్నారు. వచ్చే ఏడాది మార్చ్ వరకు అల్లు అర్జున్ జాతకం ఇలాగే ఉంటుందని చెప్పారు. ఆయన కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరి జీవితంలో తప్పొప్పులు ఉంటాయని... ఏవరూ ఏదీ కావాలని చేయరని అన్నారు.

  • Loading...

More Telugu News