Shivaraj Kumar: ఓటీటీకి వచ్చిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్!

Shivaraj Kumar Special

  • శివరాజ్ కుమార్ హీరోగా 'భైరతి రణగల్'
  • యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ 
  • రవి బస్రూర్ నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణ 
  • ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ 


కన్నడ సీమలో శివరాజ్ కుమార్ కి గల ఇమేజ్ ను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. అక్కడ ఆయనకి ఒక రేంజ్ లో మాస్ ఫాలోయింగ్ ఉంది. అందువలన వాళ్లకి నచ్చే అంశాలు తన సినిమాలో ఉండేలా ఆయన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. అలా ఆయన చేసిన సినిమానే 'భైరతి రణగల్'. సొంత బ్యానర్ పై ఆయన నిర్మించిన ఈ సినిమాకి 'నార్తన్' దర్శకత్వం వహించాడు. 

ఈ సినిమా నవంబర్ 15వ తేదీన థియేటర్లకు వచ్చింది. మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా ఆయన అభిమానులను అలరించింది. రవి బస్రూర్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. రుక్మిణి వసంత్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, రాహుల్ బోస్ కీలకమైన పాత్రను పోషించాడు. అలాంటి ఈ సినిమా, ఈ రోజు నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ కి వచ్చింది. 

ఈ సినిమా కథ విషయానికి వస్తే .. హీరో ఒక లాయర్ గా పనిచేస్తూ ఉంటాడు. చట్టం పట్ల గౌరవంతో నడచుకోమనే అందరికి చెబుతూ ఉంటాడు. కొన్ని స్వార్థ శక్తులు ఖనిజ సంపద కోసం అమాయకులైన గ్రామస్తులను వేధిస్తూ ఉంటారు. ఒక లాయర్ గా ఆ అన్యాయాన్ని అడ్డుకోలేకపోయిన అతను, మాఫియా డాన్ గా మారతాడు. ఫలితంగా ఏం జరుగుతుందనేది కథ. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.

Shivaraj Kumar
Rukmini Vasanth
Rahul Bose
Bhairathi Ranagal
  • Loading...

More Telugu News