Chinni Krishna: సినీ రచయిత చిన్ని కృష్ణ ఇంట విషాదం

 Writer Chinni Krishna mother passes away

  • చిన్ని కృష్ణ తల్లి సుశీల కన్నుమూత
  • తెనాలిలో ఈ తెల్లవారుజామున మృతి
  • ఈ సాయంత్రం తెనాలిలో జరగనున్న అంత్యక్రియలు

సినీ రచయిత చిన్ని కృష్ణ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి సుశీల కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె... ఈ తెల్లవారుజామున తెనాలిలో మృతి చెందారు. ఈ సాయంత్రం ఆమె అంత్యక్రియలు తెనాలిలో జరగనున్నాయి. సుశీల మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. 

చిన్ని కృష్ణకు అమ్మ అంటే ఎంతో అభిమానం. అమ్మ గొప్పతనాన్ని తెలుపుతూ ఆయన ఎన్నో కవితలు రాశారు. జన్మ జన్మలకు నీకే జన్మించాలని ఉందమ్మా అంటూ మాతృదినోత్సవం రోజు భావోద్వేగంతో కూడిన వీడియోను షేర్ చేశారు.

Chinni Krishna
Tollywood
  • Loading...

More Telugu News