Nazriya Nazim: 10 కోట్ల సినిమాకి 55 కోట్ల వసూళ్లు!

Sookshma Darshini Movie Update

  • మలయాళంలో రూపొందిన 'సూక్ష్మదర్శిని'
  • నవంబర్లో విడుదలైన సినిమా
  • ప్రధాన పాత్రల్లో బాసిల్ జోసెఫ్ - నజ్రియా  
  • జీ 5లో జనవరి నుంచి మొదలయ్యే స్ట్రీమింగ్


మలయాళంలో ఈ ఏడాది భారీ హిట్లు పడ్డాయి. తక్కువ బడ్జెట్ లో నిర్మితమై, భారీ వసూళ్లు రాబట్టిన సినిమాలే వాటిలో ఎక్కువగా కనిపిస్తాయి. అలాంటి సినిమాల జాబితాలో 'సూక్ష్మదర్శిని' ఒకటిగా చెప్పుకోవచ్చు. బ్లాక్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన సినిమా ఇది. బాసిల్ జోసెఫ్ - నజ్రియా నజీమ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి జితిన్ దర్శకత్వం వహించాడు.

ఈ ఏడాది నవంబర్ 22వ తేదీన ఈ సినిమా అక్కడి థియేటర్లలో విడుదలైంది.10 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, 55 కోట్లను వసూలు చేయడం విశేషం. అలాంటి ఈ సినిమా జనవరి 2వ వారంలో గానీ, 3వ వారంలో గాని 'జీ 5'లో స్ట్రీమింగ్ కానుంది. నజ్రియాకి మలయాళంలో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. కొంత గ్యాప్ తరువాత అక్కడ ఆమె చేసిన సినిమా ఇది. మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోను ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. 

ఈ సినిమాలో ప్రియా (నజ్రియా)కి పక్కింట్లో వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం చేస్తున్నారు? అనేది తెలుసుకోవాలనే యావ ఎక్కువగా ఉంటుంది. అలా ఆమె మాన్యుయేల్ ఫ్యామిలీపై దృష్టిపెడుతుంది. ఆయన ప్రవర్తన అనుమానాన్ని కలిగించడంతో మరింత దృష్టి పెడుతుంది. అప్పుడు ఆమెకి ఎలాంటి నిజాలు తెలుస్తాయి? అనేది కథ. ఈ తరహా కంటెంట్ కి ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Nazriya Nazim
Basil Joseph
Akhila Bhargavan
Sookshma Darshini
  • Loading...

More Telugu News