Allu Arjun: 3 గంటలకు పైగా అల్లు అర్జున్ విచారణ... ఎవరితోనూ మాట్లాడకుండా వెళ్లిపోయిన నటుడు

Allu Arjun enquiry completed

  • అల్లు అర్జున్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన పోలీసులు
  • న్యాయవాది సమక్షంలో విచారణ జరిపిన పోలీసులు
  • సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో విచారణ

సినీ నటుడు అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. చిక్కడపల్లి పోలీసులు దాదాపు మూడున్నర గంటల పాటు ఆయనను విచారించారు. విచారణ తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. 

అల్లు అర్జున్ ఎవరితోనూ మాట్లాడకుండా కారు ఎక్కి వెళ్లిపోయారు. విచారణ ముగిశాక అల్లు అర్జున్ ను పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయన ఇంటికి తీసుకువెళ్లారు.

విచారణ కోసం ఈరోజు ఉదయం పదకొండు గంటలకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో పోలీసులు అతనిపై ప్రశ్నల వర్షం కురిపించారు. అల్లు అర్జున్ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు.

సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ఆధ్వర్యంలో అల్లు అర్జున్‌ను విచారించారు. ఏసీపీ రమేశ్, ఇన్‌స్పెక్టర్ రాజునాయక్, న్యాయవాదులు విచారణలో ఉన్నారు. అల్లు అర్జున్‌ను 50 వరకు ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. పలు ప్రశ్నలకు ఆయన మౌనం వహించారు.

ప్రధాన నిందితుడు ఆంటోనీ అరెస్ట్

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనీయే ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. అతనిని అరెస్ట్ చేసిన పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం అతనిని థియేటర్ వద్దకు తీసుకు వెళ్లనున్నారు. ఈవెంట్లలో బౌన్సర్లకు ఆర్గనైజర్‌గా ఆంటోనీ వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ఏ11 నిందితుడిగా ఉన్నారు. అతను మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్నారు.

Allu Arjun
Telangana
Tollywood
Hyderabad
  • Loading...

More Telugu News