offbeat: శునకం ఫుట్​ బాల్​ ఆడితే... వైరల్​ వీడియో ఇదిగో!

Dog playing football in brazil

  • బీచ్ లో పెంపుడు శునకంతో ఫుట్ బాల్ ఆడిన వ్యక్తి
  • ఎక్కడా మిస్ కాకుండా అద్భుతంగా ఆడిన జాగిలం
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్.. మిలియన్ల కొద్దీ వ్యూస్

అదో బీచ్... అక్కడ ఇద్దరు ఫుట్ బాల్ ఆడుతున్నారు... బాల్ ను ఎక్కడా మిస్ కాకుండా చాలా చాకచక్యంగా పాస్ చేసుకుంటున్నారు. అందులో ఒకరికి నాలుగు కాళ్లు ఉంటే... మరొకరికి రెండు కాళ్లు ఉన్నాయి. ఇదేమిటని అనిపిస్తోందా? నిజమే... ఆ ఇద్దరిలో ఒకరు శునకం అయితే, మరొకరు దాని యజమాని.

బ్రెజిల్ లోని ఓ బీచ్ లో ఓ వ్యక్తి తన పెంపుడు జాగిలంతో ఫుట్ బాల్ ఆడిన  వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వ్యక్తి బాల్ వేసిన కొద్దీ శునకం తన తలతో సరైన పొజిషన్ లోకి కొట్టిన తీరు చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లోని అమేజింగ్ నేచర్ ఖాతాలో పోస్ట్ అయిన ఈ వీడియోను 20 లక్షల మందికిపైగా వీక్షించారు. వేల కొద్దీ లైకులు కూడా వచ్చాయి. నిజానికి ఈ వీడియో పాతదే అయినా... తాజాగా మరోసారి వైరల్ గా మారింది.

  • Loading...

More Telugu News