Sunil Yadav: అమెరికాలో భారత మోస్ట్‌వాంటెడ్ డ్రగ్ స్మగ్లర్ సునీల్ యాదవ్ కాల్చివేత.. ప్రతీకారం తీర్చుకున్నామన్న బిష్ణోయ్ గ్యాంగ్

Wanted Indian Drugs Sunil Yadav Smuggler Shot Dead In US

  • కాలిఫోర్నియాలోని స్టాక్టన్ సిటీలో ఘటన
  • సునీల్‌ను చంపింది తామేనని ప్రకటించిన రోహిత్ గొడారే
  • అంకిత్ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకున్నామన్న బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు

రాజస్థాన్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ డ్రగ్ స్మగ్లర్ అయిన సునీల్ యాదవ్ అమెరికా, కాలిఫోర్నియాలోని స్టాక్టన్ సిటీలో ప్రత్యర్థులు జరిపిన ‌కాల్పులలో హతమయ్యాడు. కరుడుగట్టిన స్మగ్లర్ అయిన సునీల్ యాదవ్ పాకిస్థాన్ మార్గం ద్వారా ఇండియాలో డ్రగ్స్ సరఫరా చేసేవాడు. కొన్నేళ్ల క్రితం రూ. 300 కోట్ల డ్రగ్స్ కన్సైన్‌మెంట్‌ను అధికారులు సీజ్ చేయడంతో అతడి పేరు వెలుగులోకి వచ్చింది.

సునీల్ యాదవ్‌ను చంపింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన రోహిత్ గొడారే ప్రకటించాడు. సునీల్ పంజాబ్ పోలీసులతో కలిసి పనిచేస్తున్నాడని, తమ సోదరుడు అంకిత్ భాడు ఎన్‌కౌంటర్‌లో చనిపోవడానికి అతడే కారణమని ఆరోపించాడు. దానికిప్పుడు ప్రతీకారం తీర్చుకున్నామని పేర్కొన్నాడు. అంకిత్ ఎన్‌కౌంటర్ విషయంలో తన పేరు బయటకు రావడంతో సునీల్ దేశం విడిచిపెట్టాడని తెలిపాడు. అమెరికాలో ఉంటూ కూడా తమ సోదరుల గురించి సమాచారం వ్యాప్తి చేస్తున్నాడని ఆరోపించాడు.

సునీల్ యాదవ్ రెండేళ్ల క్రితం రాహుల్ పేరుతో నకిలీ పాస్ పోర్టు ఉపయోగించి దేశం విడిచి పరారయ్యాడు. పంజాబ్‌లోని ఫజిల్కా జిల్లా అబోహర్‌కు చెందిన సునీల్ యాదవ్ ఒకప్పుడు లారెన్స్ బిష్ణోయ్, రోహిత్ గొడారాకు సన్నిహితంగా ఉండేవాడు. అయితే, అంకిత్ మృతి తర్వాత వీరి మధ్య శత్రుత్వం ఏర్పడింది. సునీల్ గతంలో దుబాయ్‌లో ఉన్నప్పుడు అతడిని భారత్‌కు తీసుకొచ్చేందుకు రాజస్థాన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. రాజస్థాన్‌లోని ఓ నగల వ్యాపారి హత్య కేసులో గతంలో సునీల్ అరెస్టయ్యాడు. 

  • Loading...

More Telugu News