Allu Arjun: పీఎస్ లో అల్లు అర్జున్.. సంధ్య థియేటర్ వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే యోచనలో పోలీసులు

Allu Arjun in Chikkadapally PS

  • చిక్కడపల్లి పీఎస్ లో అల్లు అర్జున్ ను విచారిస్తున్న పోలీసులు
  • బన్నీ ముందు పోలీసులు 50 ప్రశ్నలు ఉంచినట్టు సమాచారం
  • న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో విచారణ

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసుల విచారణకు సీనీ నటుడు అల్లు అర్జున్ హాజరయ్యారు. బన్నీతో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్, మామ రాజశేఖర్ రెడ్డి సినీ నిర్మాత బన్నీ వాసు కూడా పీఎస్ కు వచ్చారు. అల్లు అర్జున్ ను డీసీపీ ఆకాంక్ష్ యాదవ్, సెంట్రల్ జోన్ పోలీసు అధికారులు ప్రశ్నిస్తున్నారు. బన్నీ ముందు 50 ప్రశ్నలను ఉంచినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ తరపు న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో విచారణ జరుగుతోంది. చిక్కడపల్లి పీఎస్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 

మరోవైపు సంధ్య థియేటర్ వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే యోచనలో పోలీసులు ఉన్నట్టు సమాచారం. రాత్రి 9.30 గంటల నుంచి అల్లు అర్జున్ థియేటర్ నుంచి వెళ్లిపోయే వరకు ఏం జరిగిందనే సమాచారాన్ని సీన్ రీకన్స్ట్రక్షన్ ద్వారా పోలీసులు రాబట్టాలనుకుంటున్నారు.

  • Loading...

More Telugu News