Paatal Lok 2: అమెజాన్ ప్రైమ్ లో 'పాతాళ్ లోక్ 2'
- గతంలో వచ్చిన 'పాతాళ్ లోక్' సిరీస్
- 9 ఎపిసోడ్స్ గా అలరించిన కంటెంట్
- సూపర్ హిట్ అనిపించుకున్న క్రైమ్ థ్రిల్లర్
- జనవరి 17 నుంచి స్ట్రీమింగ్
ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లు మరింత భారీతనాన్ని సంతరించుకుంటున్నాయి. బాలీవుడ్ సినిమాలను తలపిస్తున్నాయి. దాంతో ఒక సీజన్ హిట్ కాగానే మరో సీజన్ ను సిద్ధం చేస్తున్నారు. బడ్జెట్ పెంచుతూ .. కొత్త స్టార్స్ ను రంగంలోకి దింపుతూ వెళుతుండటంతో, ఆడియన్స్ లో మరింత ఆసక్తి పెరుగుతోంది. అలా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇప్పుడు 'పాతాళ్ లోక్ 2' రెడీ అవుతోంది.
గతంలో వచ్చిన 'పాతాళ్ లోక్' సూపర్ హిట్ అనిపించుకుంది. జర్నలిస్ట్ సంజీవ్ మెహ్రా హత్యకేసును ఛేదించడానికి పోలీస్ ఆఫీసర్ హథీరామ్ చౌదరి రంగంలోకి దిగుతాడు. అయితే కొన్ని కారణాల వలన అతను సస్పెండ్ అవుతాడు. అయినా ఇన్వెస్టిగేషన్ ఆపడు. ఆ ఇన్వెస్టిగేషన్ వలన ఆయనకి ఎలాంటి చేదు నిజాలు తెలుస్తాయనే దిశగా 9 ఎపిసోడ్స్ తో ఆ సీజన్ నడిచింది.
ఇక ఇప్పుడు సీజన్ 2 సిద్ధంగా ఉంది. అనుష్క శర్మ నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్, జనవరి 17 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు. సీజన్ 2 కూడా ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలోనే నడుస్తుందని తెలుస్తోంది. సీజన్ 1ను మించి సీజన్ 2 ఉంటుందని మేకర్స్ చెప్పడంతో, ఇప్పుడు అందరూ ఈ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారు.