Sania Mirza: వైరల్ అవుతున్న సానియా మీర్జా, మహమ్మద్ షమీ పెళ్లి ఫొటోలు.. వాస్తవం ఇదీ!

Sania Mirza and Mohammad Shami AI made marriage photos

  • సానియా, షమీ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొంత కాలంగా ప్రచారం
  • ఏఐ ద్వారా వీరి పెళ్లి చేసిన ఆకతాయిలు
  • ఏఐ ద్వారా రూపొందించిన పెళ్లి ఫొటోలు వైరల్

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె తన కుమారుడితో కలిసి దుబాయ్ లో ఉంటోంది. ఇంకోవైపు టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ తన భార్య హసీన్ జహాన్ కు దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం షమీ ఒంటరిగానే జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ క్రమంలో... సానియా, షమీలు పెళ్లి చేసుకోబోతున్నట్టు కొంత కాలంగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 

తాజాగా వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, వీరి పెళ్లి నిజం కాదు. ఆ ఫొటోలు ఫేక్. కొందరు ఆకతాయిలు ఏఐ సాయంతో సానియా, షమీ పెళ్లి చేసేశారు. ఏఐ ద్వారా రూపొందించిన వీరి ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

Sania Mirza
Mohammad Shami
Marriage
  • Loading...

More Telugu News