Pushpa: సంథ్య థియేటర్ తొక్కిసలాట ఇష్యూ.. శ్రీతేజ హెల్త్ బులిటెన్ విడుదల

KIMS released SriTeja health Bulletin

  • హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసిన కిమ్స్ వైద్యులు
  • వెంటిలెటర్, ఆక్సిజన్ లేకుండానే ఊపిరి తీసుకుంటున్నట్లు వెల్లడి
  • పైప్ ద్వారానే ఆహారం అందిస్తున్నట్లు వెల్లడి
  • తెల్ల రక్త కణాల సంఖ్య క్రమంగా పెరుగుతోందన్న వైద్యులు

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ హెల్త్ బులెటిన్‌ను కిమ్స్ ఆసుపత్రి విడుదల చేసింది. ప్రస్తుతం శ్రీతేజ ఆరోగ్యం నిలకడగా ఉందని కిమ్స్ వైద్యులు వెల్లడించారు. వెంటిలెటర్, ఆక్సిజన్ లేకుండానే ఊపిరి తీసుకుంటున్నట్లు తెలిపారు.

శ్రీతేజకు లిక్విడ్ ఫుడ్ అందిస్తున్నామన్నారు. అతనికి జ్వరం తగ్గుముఖం పడుతోందన్నారు. తెల్ల రక్త కణాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు తెలిపారు. శ్రీతేజకు ప్రస్తుతం పైప్ ద్వారానే ఆహారం అందిస్తున్నట్లు హెల్త్ బులెటిన్‌లో వైద్యులు వెల్లడించారు. అయితే, నాడీ వ్యవస్థ పనితీరు ఇప్పటికీ అలాగే ఉందన్నారు.

  • Loading...

More Telugu News