Kollu Ravindra: పేర్ని నానిని వదిలే ప్రసక్తే లేదు: కొల్లు రవీంద్ర
- నీతులు వల్లించే పేర్ని నాని ఎక్కడున్నారన్న కొల్లు రవీంద్ర
- పేదల బియ్యం కొట్టేసిన వారిని పందికొక్కులా చూడాలని వ్యాఖ్య
- వివరణ కూడా ఇచ్చుకోలేని దుస్థితిలో పేర్ని నాని ఉన్నారని ఎద్దేవా
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని గోడౌన్ లో రేషన్ బియ్యం మిస్సింగ్ కేసుపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నానికి సహకరిస్తున్నారంటూ ఆరోపణలు ఉన్న అధికారులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. దీనిపై విచారణ జరుపుతామని... అధికారుల పాత్ర ఉందని తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పదేపదే నీతులు వల్లించే పేర్ని నాని ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు.
పేదల బియ్యం కొట్టేసిన పేర్ని నానిని పందికొక్కులా చూడాలని అన్నారు. తప్పుడు పనులు చేసి డబ్బులు కడితే పేర్ని నాని దొర అవుతాడా? అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ కుంభకోణంపై సిట్ ఏర్పాటుకు సిఫారసు చేస్తానని చెప్పారు. కక్ష సాధింపులకు పాల్పడాల్సిన అవసరం తమకు లేదని... కక్ష సాధింపు చేస్తే స్కాంలో ఉన్న పేర్ని నాని కుటుంబం మొత్తాన్ని జైలుకు పంపేవాళ్లమని అన్నారు. దారి మళ్లిన బియ్యంపై వివరణ కూడా ఇచ్చుకోలేని దుస్థితిలో నాని ఉన్నారని చెప్పారు. తప్పు చేయనప్పుడు దొంగలా తప్పించుకుని తిరగడం ఎందుకని ఎద్దేవా చేశారు.