Kishan Reddy: అల్లు అర్జున్ ఎపిసోడ్ కు పోలీసుల వైఫల్యమే కారణం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy says police failure led to Allu Arjun centric episode

  • పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా తొక్కిసలాట
  • సంధ్య థియేటర్ ఘటనలో కేంద్రబిందువుగా అల్లు అర్జున్
  • కక్ష సాధింపు చర్యగానే చూడాలన్న కిషన్ రెడ్డి 

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన, ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ కేంద్రబిందువుగా మారడం పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ ఎపిసోడ్ కు కారణం పోలీసుల వైఫల్యమేనని ఆరోపించారు. 

థియేటర్ వద్ద ఘటనను నివారించడంలో పోలీసులు సరిగా వ్యవహరించాలేదని కిషన్ రెడ్డి అన్నారు. పరిస్థితులను ప్రభుత్వం అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఇది కక్ష సాధింపు చర్యగానే చూడాలని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News