Pawan Kalyan: రోడ్డు నాణ్యతను స్వయంగా పరిశీలించిన పవన్ కల్యాణ్... వీడియో ఇదిగో!

Pawan Kalyan checks road quality in Godavarru village

  • క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్న పవన్ కల్యాణ్
  • నేడు కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో పర్యటన
  • గొడవర్రు గ్రామంలో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పరిశీలన

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో క్షేత్రస్థాయి పర్యటనలు జరుపుతున్నారు. ఇవాళ ఆయన కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గొడవర్రు గ్రామంలో పర్యటించారు. ఇక్కడ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. 

పల్లె పండుగ కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం గొడవర్రు గామం మీదుగా తోట్లవల్లూరు మండలం రొయ్యూరు గ్రామానికి నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. అధికారులను అడిగి పనులు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. అంతేకాదు, ఈ బీటీ రోడ్డు మూడు లేయర్ల నాణ్యతను స్వయంగా తనిఖీ చేశారు. అడుగు మేర రోడ్డును తవ్వి తీసిన శాంపిల్స్ ను పరీక్షించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు.

Pawan Kalyan
BT Road
Quality Check
Godavarru Village
Krishna District
Janasena
TDP-JanaSena-BJP Alliance

More Telugu News