Jagan: రేపటి నుంచి నాలుగు రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్న జగన్... షెడ్యూల్ ఇదిగో!
- రేపు పులివెందులకు చేరుకోనున్న జగన్
- 25న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్న వైసీపీ అధినేత
- 26న క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు ఆయన పులివెందులలో పర్యటించబోతున్నారు. జగన్ పులివెందుల షెడ్యూల్ ను వైసీపీ ప్రకటించింది.
జగన్ రేపు (డిసెంబరు 24) పులివెందులకు చేరుకుంటారు. 25వ తేదీన సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో జగన్ పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం తాతిరెడ్డిపల్లిలో ఓ కార్యక్రమానికి హాజరవుతారు. 26న పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. 27వ తేదీన పులివెందులలో ఓ వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం పులివెందుల పర్యటన ముగించుకుని తిరుగుపయనం అవుతారు.