Parthasarathi: నేను చెపితే చంద్రబాబు, పవన్ కల్యాణ్ చెప్పినట్టే: బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి

BJP MLA Parthasarathi warning to YSRCP cadre

  • కర్నూలులో కూటమి కార్యకర్తలతో పార్థసారథి సమావేశం
  • వైసీపీ వాళ్లు రేషన్ షాపులు, మిడ్ డే మీల్స్ ఏజెన్సీలు వదిలేయాలని వార్నింగ్
  • రౌడీయిజం, గూండాయిజం తనకు నచ్చవని వ్యాఖ్య

ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చెపితే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పినట్టేనని ఆయన అన్నారు. కర్నూలులో నిర్వహించిన కూటమి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

వైసీపీకి చెందిన వాళ్లు మిడ్ డే మీల్స్ ఏజెన్సీలు, రేషన్ షాపులు, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు వదిలేసి వెళ్లాలని పార్థసారథి హెచ్చరించారు. లేకపోతే లెక్క వేరేగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. అధికారుల నుంచి ఎలాంటి లెటర్ తెచ్చుకోమని... తాను చెప్పిందే పెద్ద లెటర్ అని చెప్పారు. అందరూ శాంతియుతంగా ఉండాలని... రౌడీయిజం, గూండాయిజం తనకు నచ్చవని అన్నారు. పార్థసారథి ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే బీజేపీ కార్యకర్తలు ఐదు రేషన్ షాపులకు తాళాలు వేసి, వాటిని తమ ఆధీనంలోకి తీసుకోవడం గమనార్హం. 

  • Loading...

More Telugu News