K Kavitha: రేవంత్ రెడ్డి రెండు నాల్కల ధోరణికి ఇది నిదర్శనం: ఎమ్మెల్సీ కవిత

Kavitha fires on Revanth Reddy

  • ఎన్నికలకు ముందు ఒక మాట, గెలిచిన తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని కవిత మండిపాటు
  • రైతుల భూములను వేలం వేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శ
  • అప్పులు తీర్చాలని వేధిస్తున్నారని ఆగ్రహం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు ఓ మాట, గెలిచిన తర్వాత మరో మాట మాట్లాడుతూ రేవంత్ రెడ్డి రెండు నాల్కల ధోరణిని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. రైతుల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం వేలం వేస్తోందని దుయ్యబట్టారు. 

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల భూములను వేలం వేసేందుకు ప్రభుత్వం చేస్తున్న యత్నాలను ఖండిస్తున్నామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో అంకోల్ తండా ప్రజలను ఆదుకుంటానని నమ్మించిన రేవంత్ రెడ్డి... ఇప్పుడు అప్పులు చెల్లించాలంటూ రైతులను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇది రైతులకు రేవంత్ చేస్తున్న మోసానికి ఒక నిదర్శనమని చెప్పారు. 

కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం, దుర్కి, నస్రుల్లాబాద్, మిర్జాపూర్, నాచుపల్లిలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల భూములను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని కవిత అన్నారు. రుణాలు మాఫీ చేసి అన్నదాతకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, డబ్బులు కట్టాలంటూ రైతులపై ఒత్తిడి తీసుకురావడం, బలవంతంగా భూముల వేలానికి ప్రయత్నించడం నియంతృత్వ పాలనను తలపిస్తోందని మండిపడ్డారు.

K Kavitha
BRS
Revanth Reddy
Congress
  • Loading...

More Telugu News