Agnivir Vayu: భారత వాయు సేనలో అగ్నివీర్ ల నియామకాలు.. వివరాలు ఇవిగో!

Indian Airforce Job Notification Under Agnipath Scheme

--


భారత వాయుసేన నియామక ప్రకటన విడుదల చేసింది. అగ్నిపథ్ స్కీంలో భాగంగా చేపట్టే ఈ నియామకం నాలుగేళ్లకు మాత్రమే పరిమితం. ఇంటర్, తత్సమాన కోర్సులు పూర్తిచేసిన అవివాహిత స్త్రీ, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని వాయుసేన తెలిపింది. ఎంపికైన అభ్యర్థులను అగ్నివీర్ లుగా వ్యవహరిస్తారు. నాలుగేళ్ల పాటు వాయుసేనలో సేవలందించాల్సి ఉంటుంది. పరిమిత కాలం నియామకమే అయినప్పటికీ శారీరక, మానసిక సామర్థ్యాల విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని అధికారులు తెలిపారు.

అగ్నివీర్ ల నియామకానికి సంబంధించి వాయు సేన విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. వచ్చే ఏడాది జనవరి 7 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. జనవరి 27 తో దరఖాస్తు గడువు ముగుస్తుంది. పూర్తి వివరాలు, దరఖాస్తు చేసుకోవడానికి వాయుసేన అధికారిక వెబ్‌సైట్ https://agnipathvayu.cdac.in/AV/ లో సంప్రదించాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మార్చిలో పరీక్ష నిర్వహించి నవంబర్ లో తుది ఫలితాలను ప్రకటిస్తారు.

పోస్టులు: అగ్నివీర్ వాయు

విద్యార్హత: కనీసం 50% మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఇంటర్/ తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్

వయోపరిమితి: 1-1-2005 నుంచి 1-07-2008 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు రుసుం: రూ. 500

Agnivir Vayu
Air Force
Central Govt
Agnipath Scheme
AirForce Jobs
Job Notifications
  • Loading...

More Telugu News