CV Anand: సహనం కోల్పోయా.. క్షమించండి: సీవీ ఆనంద్

Hyderabad CP CV Anand Apologizes To National Media

  • జాతీయ మీడియాకు సారీ చెప్పిన హైదరాబాద్ కమిషనర్
  • సంధ్య థియేటర్ ఘటనకు జాతీయ మీడియా మద్దతిస్తోందంటూ చేసిన వ్యాఖ్యలపై వివరణ 
  • ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానంటూ ట్వీట్

సంధ్య థియేటర్ ఘటనపై నిర్వహించిన ప్రెస్ మీట్ లో జాతీయ మీడియాను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ విచారం వ్యక్తం చేశారు. రెచ్చగొట్టే ప్రశ్నలు వేయడంతో తాను సహనం కోల్పోయానని చెప్పారు. ఈ ఘటనపై జాతీయ మీడియాకు క్షమాపణ చెబుతున్నానని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. సంధ్య థియేటర్ ఘటనకు జాతీయ మీడియా మద్దతిస్తోందంటూ తాను చేసిన వ్యాఖ్యలను వాపస్ తీసుకుంటున్నట్లు చెప్పారు.

రేవతి మరణం, థియేటర్ వద్ద తొక్కిసలాటకు సంబంధించి నిజానిజాలు వెల్లడించేందుకు ఆదివారం పోలీసులు ప్రెస్ మీట్ నిర్వహించిన విషయం తెలిసిందే. థియేటర్‌లో ఆరోజు ఏం జరిగిందో తెలుపుతూ సీవీ ఆనంద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ.. నేషనల్‌ మీడియా ఈ ఘటనకు మద్దతు ఇస్తోందని అన్నారు. దీనిపై అక్కడ ఉన్న జర్నలిస్టులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేయడంతో సీవీ ఆనంద్ తాజాగా ట్విట్టర్ లో స్పందించారు. ‘రెచ్చగొట్టే ప్రశ్నలు వేయడంతో సహనం కోల్పోయి ఆ వ్యాఖ్యలు చేశాను. నేను కాస్త సంయమనం పాటించాల్సింది. నేను చేసిన పొరపాటు గుర్తించి నేషనల్ మీడియాకు సారీ చెబుతున్నా’ అంటూ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News