Revanth Reddy: అల్లు అర్జున్ నివాసంపై దాడిని ఖండించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy condemns attack on Allu Arjun house

  • హైదరాబాదులో స్టార్ హీరో అల్లు అర్జున్ నివాసంపై దాడి
  • సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నానంటూ రేవంత్ రెడ్డి ప్రకటన
  • శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ఆదేశాలు 

హైదరాబాదులో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నివాసంపై దాడి జరగడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నట్టు తెలిపారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీస్ కమిషనర్ ను ఆదేశిస్తున్నానని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని హెచ్చరించారు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు.

  • Loading...

More Telugu News