Chandrababu: వెల్ డన్ దేవాన్ష్... మనవడి ఘనతకు మురిసిపోయిన చంద్రబాబు

Chandrababu appreciates his grand son Nara Devansh for his world record

  • ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్-175 పజిల్స్ ను సాధించిన నారా దేవాన్ష్
  • వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్)లో స్థానం
  • మనవడిపై ప్రశంసల వర్షం కురిపించిన ఏపీ ముఖ్యమంత్రి

ఏపీ మంత్రి నారా లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్-175 పజిల్స్ ను సాధించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్)లో స్థానం సంపాదించడం తెలిసిందే. 9 ఏళ్ల చిన్న వయసులోనే మనవడు సాధించిన ఘనత పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. వెల్ డన్ దేవాన్ష్ అంటూ మనవడ్ని మనస్ఫూర్తిగా అభినందించారు. 

"175 పజిల్స్ ను పరిష్కరించి ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ సాధించడమే గాకుండా వరల్డ్ రికార్డు నెలకొల్పినందుకు కంగ్రాచ్యులేషన్స్. అంకితభావం, కఠోర శ్రమ, పట్టుదల... ఇవే విజయానికి సూత్రాలు. ఈ ఘనతను సాధించడానికి నువ్వు గత కొన్ని నెలలుగా ఎంతో శ్రద్ధగా సాధన చేశావు. నువ్వు సాధించిన వరల్డ్ రికార్డు పట్ల గర్విస్తున్నాను నా లిటిల్ గ్రాండ్ మాస్టర్" అంటూ చంద్రబాబు మనవడిపై ప్రశంసల వర్షం కురిపించారు. 

తన కోడలు నారా బ్రాహ్మణి షేర్ చేసిన వీడియోను కూడా చంద్రబాబు తన ట్వీట్ లో పొందుపరిచారు.

  • Loading...

More Telugu News