Allu Arjun: అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై మంత్రి శ్రీధర్ బాబు స్పందన

Minister Sridhar Babu reacts on Allu Arjun press meet

  • సంధ్య థియేటర్ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి
  • అల్లు అర్జున్ పై ఫైర్
  • ప్రెస్ మీట్ పెట్టిన అల్లు అర్జున్
  • అల్లు అర్జున్ రోడ్ షో చేశారా లేదా అనేది వీడియో చూస్తే తెలుస్తుందన్న శ్రీధర్ బాబు

సంధ్య థియేటర్ ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హీరో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. అనుమతులు ఉన్నందునే తాను థియేటర్ వద్దకు వెళ్లానని, తొక్కిసలాట గురించి థియేటర్ లోపల పోలీసులు ఎవరూ తనతో మాట్లాడలేదని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై తాజాగా తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. 

పోలీసులు పర్మిషన్ ఇచ్చారా, లేదా? సంధ్య థియేటర్ వద్ద కారులోంచి లేచి అభిమానులకు అభివాదం చేయడం... తదితర విషయాల్లో వాస్తవాలు ఏంటనేది అల్లు అర్జున్ కు కూడా తెలుసని అన్నారు. సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ రోడ్ షోలో పాల్గొన్నారా, లేదా అనేది వీడియోలు చూస్తే తెలుస్తుందని స్పష్టం చేశారు.  

సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ను మాత్రమే కాకుండా, బాధిత కుటుంబాన్ని కూడా పరామర్శించాలనేది ముఖ్యమంత్రి ఉద్దేశమని శ్రీధర్ బాబు వివరించారు.

  • Loading...

More Telugu News