Ram Charan: డాలస్ లో అభిమానులతో ప్రత్యేకంగా ముచ్చటించిన రామ్ చరణ్

Ram Charan attends fan meeting in Dallas

  • అమెరికా గడ్డపై నేడు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ఈ కార్యక్రమానికి ముందుగా అభిమానులతో సమావేశమైన రామ్ చరణ్
  • జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తున్న గేమ్ చేంజర్

గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అమెరికా వెళ్లిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్... డాలస్ నగరంలో తన అభిమానులతో ముచ్చటించారు. డాలస్ లో నేడు గేమ్ చేంజర్ గ్లోబల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు హీరో అల్లు అర్జున్, నిర్మాత దిల్ రాజు తదితరులు అమెరికా తరలి వెళ్లారు. ఇక, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముందు అభిమానులతో నిర్వహించిన కార్యక్రమంలో రామ్ చరణ్, దిల్ రాజు పాల్గొన్నారు.

రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా సౌతిండియా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం గేమ్ చేంజర్. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

రిలీజ్ డేట్ కు మరో మూడు వారాల సమయం మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. అందులో భాగంగానే అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. అమెరికా గడ్డపై ప్రీ రిలీజ్ వేడుక జరుపుకుంటున్న మొట్టమొదటి భారతీయ సినిమాగా గేమ్ చేంజర్ చరిత్ర సృష్టిస్తోంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. జరగండి జరగండి, రా మచ్చా పాటలు జనాల్లోకి బాగా వెళ్లాయి.

  • Loading...

More Telugu News