Revanth Reddy: కేటీఆర్, హరీశ్ రావులకు రేవంత్ రెడ్డి సవాల్

Revanth Reddy fires on KTR and Harish Rao

  • ఏం చేసినా వద్దంటున్నారని రేవంత్ ఫైర్
  • తనకు గుంటూరులో చదువుకున్న తెలివితేటలు లేవని వ్యాఖ్య
  • గన్ మన్లు లేకుండా మూసీకి వెళ్దామని సవాల్

నల్గొండ జిల్లాకు మూసీ మురుగు నుంచి విముక్తి కల్పించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే... బీఆర్ఎస్ పార్టీ కాళ్లలో కట్టెలు పెడుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన వద్దంటారు, ఫ్యూచర్ సిటీ వద్దంటారు, రుణమాఫీ వద్దంటారు, ఇండస్ట్రీ పెడతామంటే వద్దంటారు... ఇంకేం చేయాలని ప్రశ్నించారు. తనకు గుంటూరులో చదువుకున్న తెలివితేటలు లేవని... సామాన్యుడి తెలివితేటలు ఉన్నాయని చెప్పారు. 

బీఆర్ఎస్ లో కూడా కొందరు మంచి వాళ్లు ఉన్నారని రేవంత్ అన్నారు. వాళ్లంతా విధిలేని పరిస్థితిలో అక్కడ ఉన్నారని చెప్పారు. వాళ్లంతా తనకు కావాల్సిన వాళ్లేనని అన్నారు. కేటీఆర్, హరీశ్ రావులను సవాల్ చేస్తున్నానని... మూసీకి వెళ్దాం రావాలంటూ ఛాలెంజ్ చేశారు. గన్ మన్లు లేకుండా మూసీకి వెళ్దామని సవాల్ విసిరారు. 21 ఏళ్ల అనుభవం ఉందని హరీశ్ రావు చెప్పుకుంటున్నారని... ఆ అనుభవంతో స్పీకర్ మీద దాడి చేస్తారా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News