Narendra Modi: కువైట్ కు బయల్దేరిన ప్రధాని మోదీ
- 43 ఏళ్ల తర్వాత తొలిసారి కువైట్ లో పర్యటిస్తున్న భారత ప్రధాని
- 1981లో కువైట్ లో పర్యటించిన ఇందిరాగాంధీ
- కువైట్ రాజుతో పలు అంశాలపై చర్చలు జరపనున్న మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ కువైట్ కు బయల్దేరారు. కువైట్ లో ఆయన రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. భారత ప్రధాని కువైట్ లో పర్యటించనుండటం 43 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. దీంతో, మోదీ పర్యటనకు ప్రాధాన్యత నెలకొంది.
1981లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కువైట్ లో పర్యటించారు. 2009లో నాటి ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆ దేశంలో పర్యటించారు.
కువైట్ పర్యటనలో ఆ దేశ రాజు అమీర్ షేక్ మెషల్ అల్ అహ్మద్ అల్ జబ్బర్ అల్ సభాతో మోదీ సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతమయ్యే దిశగా ఇరువురు చర్చలు జరపనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన సహకారం, సంస్కృతి తదితర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. కువైట్ లో నివసిస్తున్న భారతీయులతో కూడా మోదీ సమావేశం కానున్నారు. వారిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.