Andhra Pradesh: ఏపీ ఉన్న‌త విద్యామండ‌లి ఛైర్మ‌న్‌గా మ‌ధుమూర్తి నియామ‌కం

Prof Madhumurthy Appointed as AP Council of Higher Education Chairman

      


ఏపీ ఉన్న‌త విద్యామండ‌లి ఛైర్మ‌న్‌గా మ‌ధుమూర్తి నియ‌మితుల‌య్యారు. మూడేళ్ల‌పాటు ఆయ‌న ఈ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు. ఈ మేర‌కు విద్యా శాఖ కార్య‌ద‌ర్శి కోన శ‌శిధ‌ర్ శ‌నివారం ఉత్త‌ర్వులు జారీ చేశారు. కాగా,  ప్రొఫెస‌ర్ మ‌ధుమూర్తి ప్ర‌స్తుతం వ‌రంగ‌ల్ ఎన్ఐటీ బోర్డ్ ఆఫ్ గ‌వ‌ర్న‌ర్స్ స‌భ్యుడిగా ఉన్నారు.

గుంటూరు జిల్లా తెనాలి మండ‌లం జాగ‌ర్ల‌మూడికి చెందిన మ‌ధుమూర్తి విశాఖ‌ప‌ట్నంలో విద్య‌న‌భ్య‌సించారు. ప్ర‌స్తుతం హ‌నుమ‌కొండ‌లో ఉంటున్నారు. ఇక ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన రోజే అప్ప‌టి ఛైర్మ‌న్ హేమ‌చంద్రారెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి ఈ పోస్టు ఖాళీగానే ఉంది. వైస్ ఛైర్మ‌న్ రామమోహ‌న్‌రావు ఇన్‌ఛార్జిగా కొన‌సాగుతున్నారు.  

  • Loading...

More Telugu News