Chandrababu: వైఎస్ జగన్‌కు సీఎం చంద్రబాబు బర్త్‌డే విషెస్.. ఆసక్తికర ట్వీట్

CM Chandrababu birthday wishes to YS Jagan On X

  • జగన్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
  • మంచి ఆరోగ్య, దీర్ఘాయువు పొందాలంటూ ఆకాంక్ష
  • ఎక్స్ వేదికగా స్పందించిన టీడీపీ అధినేత

ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో ఢీ అంటే ఢీ అంటూ నిత్యం రాజకీయ విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటుంటారు. వారే ఏపీ ప్రస్తుత సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి ఇవాళ (డిసెంబర్ 21) పుట్టిన రోజు జరుపుకుంటున్న వైఎస్ జగన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో దీర్ఘకాలం ప్రజాసేవలో కొనసాగాలని కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు. వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి కూడా సోషల్ మీడియాలో జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పారు.

‘‘వైఎస్ జగన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మంచి ఆరోగ్యంతో దీర్ఘాయువు పొందాలని కోరుకుంటున్నాను’’ అంటూ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. కాగా, జగన్ బర్త్‌డే వేడుకలను వైఎస్సార్‌సీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నాయి. అభిమానులు కేక్‌ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.

Chandrababu
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News