Youtube: ఎక్కువ వ్యూస్ కోసం తప్పుడు థంబ్ నెయిల్స్... చర్యలకు సిద్ధమైన యూట్యూబ్

Youtube set bring new measures to restrict wrong thumbnails

  • యూట్యూబ్ లో పెడ ధోరణులు
  • వ్యూస్ కోసం పాకులాడుతూ యూజర్లను తప్పుదారి పట్టించే థంబ్ నెయిల్స్
  • రాంగ్ టైటిల్స్ తో యూజర్లను విసుగెత్తిస్తున్న యూట్యూబ్ చానళ్లు
  • కొత్త నిబంధనలు తీసుకువస్తున్న యూట్యూబ్

ప్రముఖ వీడియో పబ్లిషింగ్ ప్లాట్ ఫాం యూట్యూబ్ చాలామందికి ఆదాయ వనరుగా మారింది. దాంతో, అధిక వ్యూస్ కోసం కొందరు యూట్యూబర్లు అడ్డదారులు తొక్కుతుంటారు. వీక్షకులను తప్పుదారి పట్టించేలా థంబ్ నెయిల్స్ పెట్టడం, టైటిల్ లో పేర్కొన్న దానికి వీడియోలో ఉన్న కంటెంట్ కు సంబంధం లేకపోవడం... ఇలా అనేక రకాలుగా యూట్యూబ్ లో ఇష్టారాజ్యంగా వ్యూస్ వేట సాగుతుంటుంది. ఇలాంటి పోకడలతో యూట్యూబ్ పై యూజర్లలో విశ్వసనీయత తగ్గుతోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో, యూట్యూబ్ కఠిన చర్యలకు సిద్ధమైంది. తప్పుడు థంబ్ నెయిల్స్, రాంగ్ హెడ్డింగ్ లతో యూజర్ల సమయాన్ని వృథా చేసే యూట్యూబ్ చానళ్లను కట్టడి చేయాలని నిర్ణయించింది. అందుకోసం త్వరలోనే నూతన నిబంధనలు తీసుకురానున్నట్టు యూట్యూబ్ వెల్లడించింది. 

ఈ కొత్త నిబంధనల అమలు కోసం యూట్యూబ్ చానళ్ల నిర్వాహలకు తగిన సమయం ఇవ్వనున్నారు. ఆ తర్వాత కూడా తప్పుడు థంబ్ నెయిల్స్ తో వీడియోలు అప్ లోడ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. మొదటి హెచ్చరికగా అలాంటి వీడియోలను డిలీట్ చేస్తారు. మరోసారి తప్పిదానికి పాల్పడితే చానల్ పై ఆంక్షలు విధిస్తారు. ఇందులో జరిమానాలు కూడా ఉండొచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News