Ram Charan: దేశంలోనే అతి పెద్దదైన రామ్ చరణ్ కటౌట్... ఈ నెల 29న ఆవిష్కరణ... ఎక్కడంటే!

Indias biggest cutout of Ram Charan will be unveiled on Dec 29

  • రామ్ చరణ్, శంకర్ కలయికలో గేమ్ చేంజర్
  • జనవరి 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
  • విజయవాడలో రామ్ చరణ్ భారీ కటౌట్ ఆవిష్కరణకు రంగం సిద్ధం

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తున్న తరుణంలో, మేనియా మొదలైంది. గేర్ మార్చిన చిత్రబృందం ప్రమోషన్స్ ను పీక్స్ కు తీసుకెళ్లేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకుంటోంది. 

ఈ క్రమంలో, డిసెంబరు 29న భారతదేశంలోనే అతి పెద్దదైన రామ్ చరణ్ కటౌట్ ను ఆవిష్కరించనున్నారు. ఇది ఎక్కడో కాదు... విజయవాడ బృందావన్ కాలనీలో వజ్రా గ్రౌండ్స్ ఇందుకు వేదికగా నిలుస్తోంది. సాయంత్రం 4 గంటల నుంచి ఈ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు గేమ్ చేంజర్ మేకర్స్ అనౌన్స్ చేశారు. 

రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా సౌతిండియా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న గేమ్ చేంజర్ చిత్రం ప్రారంభం నుంచి ఓ రేంజ్ లో బజ్ క్రియేట్ చేసింది. తమన్ సంగీతంలో వచ్చిన ఈ సినిమా పాటలు ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తున్నాయి. దానికి తోడు టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఎక్స్ పెక్టేషన్స్ కు ఏమాత్రం తగ్గకుండా తమ చిత్రం ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. శంకర్ ట్రాక్ రికార్డు చూస్తే...గేమ్ చేంజర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. 

  • Loading...

More Telugu News